Home  »  TV News  »  డాక్టర్ గౌతమే సిద్ధు అని తను గుర్తుపట్టిందా?

Updated : Mar 17, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -106 లో.. ముకుందకి కౌంటర్ ఇచ్చి నందు కి భోజనం తీసుకొని వెళ్ళి తినమంటుంది కృష్ణ. అప్పుడు నందు తినకుండా.. నిన్ను బండి మీద తీసుకొచ్చిన అతను ఎవరని అడుగుతుంది. అతను మా గౌతమ్ సర్ అని కృష్ణ అనగానే.. నాకేంటి సిద్దు లాగా అనిపించిందని నందు అంటుంది. "సిద్దు ఎవరు నందు" అని కృష్ణ అడగగానే.. ఇక నందు తలపట్టుకొని నాకు గుర్తు రావట్లేదని అనేసరికి సరే సరే నువ్వు ఏం ఆలోచించకు అని కృష్ణ అంటుంది.

మరోవైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. అబ్బా ఈ రోజు వంటలు బాగున్నాయ్ అంటాడు. బాగా తిని వచ్చారా అని కృష్ణ అనేసరికి.. "లేదు కృష్ణ నీ ముందు అలా అన్నాను.. కాని నేను కూడా తినలేదు. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను" అని మురారి అంటాడు. మరి ఏం చేద్దాం సర్ నాకు ఆకలిగా ఉందని కృష్ణ అంటుంది. బయటకు వెళ్లి తినొద్దాం.. ఇంట్లో తినొద్దని పెద్దమ్మ చెప్పింది కదా, బయట వద్దనలేదు కదా అని మురారి అంటాడు. అలా అనుకొని ఇద్దరు ఇంట్లో ఎవరికి కనపడకుండా బయటకు వెళ్తారు. బయట ఎక్కడ చూసిన అన్ని క్లోజ్ చేసి ఉంటాయ్. ఒక దగ్గర ఓపెన్ చేసి ఉన్నా కూడా.. "ఇప్పుడు ఏం లేవు అన్నీ అయిపోయాయి" అని షాప్ అతను అనడంతో.. ఇతను ఎవరు అనుకున్నావ్ ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ లేచి కూర్చోండి సర్ అని టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తారు. ఇక ఆ తర్వాత ఇద్దరు టిఫిన్ చేసి దార్లో ఐస్ క్రీం తింటూ ఇంటికి వస్తారు.

కృష్ణ ఏం చేస్తుంది.. మురారి ఏమైనా భోజనం తీసుకెళ్ళి తనకి ఇచ్చాడా అని ముకుంద వాళ్ళ గదిలోకి వెళ్లి చూస్తుంది. ముకుంద వెళ్ళి వారి గదిలో చూసేసరికి మురారి, కృష్ణ ఇద్దరు లేకపోవడంతో.. ఇద్దరు బయటికి వెళ్ళారా.. వీళ్ళ సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఇంతలో బయట నుండి కృష్ణ, మురారిలు వస్తారు. వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్లారని ముకుంద అడగుతుంది. నీకు ఎందుకు చెప్పాలి.. నా భర్తతో నేను బయటికి వెళ్ళాను. ప్రతి దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్ అని ముకుందకి కృష్ణ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాని తర్వాత మురారి చెయ్యి పట్టుకొని.. పదండి ఏసీపీ సర్ అని లోపలికి తీసుకెళ్తుంది కృష్ణ. రేపు మీ సంగతి పెద్ద అత్తయ్యతో చెప్తా అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.